Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 December 2025, 1:25 pm Posted by : ramakrishna

24న సావిత్రిబాయి పూలే విగ్రహ ఆవిష్కరణ

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : 

 

చదువుల తల్లి సామాజిక సంస్కర్త ఎంతోమంది నిరుపేదలకు అభాగ్యులకు 150 ఏళ్ల కిందటే చదువు నేర్పించిన గొప్ప ధార్శనికిరాలు…. సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని నిజామాబాద్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని హనుమాన్ జంక్షన్ లో గల మహనీయుల పార్కులో ఏర్పాటు చేశామని జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. ఈ సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీలు  ఈ నెల 24వ తేదీన  ఆవిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీలకతీతంగా ప్రతి పార్టీలోని ముఖ్య నాయకులను ఆహ్వానించినట్లు కూడా తెలిపారు. ఎంపీ ధర్మపురి అరవింద్ , బాజిరెడ్డి గోవర్ధన్, ఆకులను లలిత , గడుగ గంగాధర్ తాహిర్ బిన్ హందాన్ , కేశవ వేణు , నరాల రత్నాకర్ , బిజెపి జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ , బిఆర్ఎస్ నగర అధ్యక్షులు సిర్ప రాజు , కాంగ్రెస్ నగర అధ్యక్షులు రామకృష్ణ , తదితర ముఖ్య నాయకులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్టు నరాల సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క బీసీ బిడ్డ పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ లో గల మహనీయుల పార్కులో సావిత్రిబాయి పూలే విగ్రహ ఏర్పాటు చేశామని ఈ కార్యక్రమానికి ప్రతి కులం నుండి తక్కువలో తక్కువగా ఒక 50 మంది రావాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు పిలుపునిచ్చారు. అన్ని కులాల నుండి అన్ని సంఘాల నుండి ప్రతి ఒక్క బహుజనుడు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని నగర అధ్యక్షుడు దర్శనం దేవేందర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన ఈ విలేకరుల సమావేశంలో నరాల సుధాకర్ తో పాటు  ఆంజనేయులు,  గంగాకిషన్, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, కరిపే రవీందర్, శ్రీలత, బగ్గలి అజయ్, నారాయణరెడ్డి, సాయి బసవ, చంద్రకాంత్, జయ, చంద్రమోహన్, కోడూరు స్వామి, బాలన్న, మాకు రవి, ఓంకారం మురళి, రుక్మిణి, రేఖ, రమణ స్వామి తదితరులు పాల్గొన్నారు