పీడీఎస్యూ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని బాలుర బీసీ వసతి గృహంలో శుక్రవారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ నగర నాయకులు నసీర్ మాట్లాడుతూ, సత్యశోధక్ సమాజ్ ను ప్రారంభించి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు అని అన్నారు. బాల్యవివాహాలకు, మూఢనమ్మకాలకు, సతి సహగమనానికి వ్యతిరేకంగా,వితంతు పునర్వివాహాల కొరకు బ్రాహ్మణ మనువాద వ్యవస్థకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాన్ని నడిపిన మన దేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని తెలిపారు. అట్టడుగు వర్గాలు, మహిళలకు హక్కులు నిరాకరించబడిన దేశంలో ఆనాటి...