Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 January 2025, 6:57 pm Posted by : ramakrishna

పీడీఎస్యూ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని బాలుర బీసీ వసతి గృహంలో శుక్రవారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ నగర నాయకులు నసీర్ మాట్లాడుతూ, సత్యశోధక్ సమాజ్ ను ప్రారంభించి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు అని అన్నారు. బాల్యవివాహాలకు, మూఢనమ్మకాలకు, సతి సహగమనానికి వ్యతిరేకంగా,వితంతు పునర్వివాహాల కొరకు బ్రాహ్మణ మనువాద వ్యవస్థకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాన్ని నడిపిన మన దేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని తెలిపారు. అట్టడుగు వర్గాలు, మహిళలకు హక్కులు నిరాకరించబడిన దేశంలో ఆనాటి సమాజం కట్టుబాట్లను,సాంప్రదాయాలను,ఆదిపత్య వర్గాలను ధిక్కరించిన ధైర్యశీలి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. పురాతన కట్టుబాట్లను,సాంప్రదాయాలను నేటి ఆధునిక సమాజంలో పునరుద్ధరించాలనే మనువాదపు విధానాలను వ్యతిరేకించాలన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన, ప్రజలు ముఖ్యంగా మహిళలు సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో ముందుకు రావాలని తెలిపారు. సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో అందరికీ సమాన విద్య సమ సమాజ స్థాపనకు ముందుకు నడవాల్సిందిగా తెలిపారు.ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు, హాస్టల్ కమిటీ విద్యార్థి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.