కలెక్టరేట్లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు 

నిజామాబాద్, బతుకమ్మ : ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను గురువారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ఘనంగా నిర్వహించారు. ప్రధాన సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి అదనపు కలెక్టర్ అంకిత్, ఇతర జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలోనూ తన భర్త జ్యోతిరావు...