సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ లోని శ్రీ భాషిత పాఠశాలలో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బి జె పీ రాష్ట్ర నాయకుడు, పసుపు రైతు ఉద్యమ నాయకుడు, గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘ వ్యవస్థాపకులు నరసింహనాయుడు, పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోటపటి నరసింహనాయుడు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే విద్యారంగంలో చేసిన సేవలను గుర్తించి, ఆమె మహిళలకు కూడా విద్య అవసరం అని చెప్పి విద్యారంగంలో మొదటి మహిళ గురువుగా ఎదిగిందన్నారు. అంతేకాకుండా ఒక మహిళకు ఆదర్శంగా నిలిచారు...