Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 January 2025, 5:03 pm Posted by : ramakrishna

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ లోని శ్రీ భాషిత పాఠశాలలో శుక్రవారం సావిత్రిబాయి పూలే  జయంతి సందర్భంగా బి జె పీ రాష్ట్ర నాయకుడు, పసుపు రైతు ఉద్యమ నాయకుడు, గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘ వ్యవస్థాపకులు  నరసింహనాయుడు,  పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోటపటి నరసింహనాయుడు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే విద్యారంగంలో చేసిన సేవలను గుర్తించి, ఆమె మహిళలకు కూడా విద్య అవసరం అని చెప్పి విద్యారంగంలో మొదటి మహిళ గురువుగా ఎదిగిందన్నారు. అంతేకాకుండా ఒక మహిళకు ఆదర్శంగా నిలిచారు అని చెప్పారు.   పాఠశాల కరస్పాండ్ పోలపల్లి సుందర్  మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఆమె మహిళల హక్కుల కోసం సాధించడంలో,   విద్యా రంగంలో సాధించిన ప్రగతిలో ఒక వెలుగు, ఆమె జీవితం అనేక మహిళలకు ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని సమాజంలో ఉన్నత స్థానాన్ని సాధించడానికి కృషి చేసిందని గుర్తించి విద్యార్థుల గొప్ప సందేశాన్ని అందిస్తుందని చెప్పారు. ఈ  కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.