బతుకమ్మ, మోర్తాడ్: సావిత్రిబాయి పూలే అణ గారిన మహిళలకు ఉచిత విద్యను అందించి సమాజానికి మహిళలకు విద్య యొక్క ప్రాధాన్యతను తెలియజేసి సేవలందించినారని మోర్తాడ్ ఎంఈఓ సమ్మిరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాలెం లో మహిళా ఉపాధ్యాయ దినోత్సవంను ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దొర్ల.సమ్మిరెడ్డి మండల విద్యాధికారి మోర్తాడు పాల్గొని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని అయినా సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి, మహిళా ఉపాధ్యాయులైన జయశ్రీ, త్రివేణి,మమత మరియు రాజేశ్వరి గారలను శాలువా, పూలదండలతో ఘనంగా సన్మానించడం జరిగినది. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నేటి మహిళలు సమాజంలో మహిళా సాధికారతను సాధించడం వారి కృషి వలన అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పల్లెపాటి. వేణుగోపాలరావు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ వసంత, ఉపాధ్యాయులు మహేష్ కుమార్, నరసింహస్వామి, చంద్రశేఖర్, రాజేందర్, సైఫ్ అలీ, నచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.