Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 January 2026, 12:15 pm Posted by : ramakrishna

సావిత్రి బాయి సేవలు మరువలేనివి

నిజామాబాద్, బతుకమ్మ :  సావిత్రిబాయి పూలే 195వ జయంతిని శనివారం జిల్లా కేంద్రంలో జిల్లా మహిళ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ మహనీయుల పార్కులో గల సావిత్రిబాయి పూలే విగ్రహానికి మహిళ సంక్షేమ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  జిల్లా అధ్యక్షురాలు శ్రీలత మాట్లాడుతూ సావిత్రి బాయి సేవలు మరువలేనివని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో వాసంజయ, రుక్మిణి, రేఖ పాల్గొన్నారు.