- సావిత్రి బాయి పూలే ఆదర్శంగా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలన్నారు
- నిజామాబాద్ జిల్లా విద్యాధికారి అశోక్
నిజామాబాద్, బతుకమ్మ : సావిత్రి బాయి పూలే 194 వ జయంతి సందర్భంగా శుక్రవారం ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో గల ఆమె విగ్రహానికి జిల్లా విద్యాశాఖ అధికారి, బిసిటియు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డిఇఓ అశోక్ మాట్లాడుతూ దాదాపు 170 సంవత్సరాల క్రితమే స్త్రీ విద్య ప్రాముఖ్యత ను గుర్తించి స్త్రీల కోసం అనేక పాఠశాలలు స్థాపించి విద్య ను అందించిన ఘనత ఆమెదన్నారు. ఆమె ప్రముఖ సంఘ సంస్కర్త అని, ఆమె ను ఆదర్శంగా తీసుకుని ఉపాధ్యాయులు విద్యా బోధన చేయాలన్నారు. బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా నిర్వహించాలని ఉత్తర్వులు ఇవ్వడం హర్షణీయమన్నారు. సావిత్రి బాయి పూలే జీవిత చరిత్ర ను పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశం గా చేర్చాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. పూలే దంపతులకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డు ను ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్షి ఆర్ గోపాలకృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షులు కంచరి రవికుమార్, కొట్టాల రామకృష్ణ, అసోసియేటడ్ అధ్యక్షులు ఎ మోహన్, గౌరవ అధ్యక్షులు కైరంకొండ బాబు, ఉపాధ్యక్షులు విజయ్ కుమార్, జె శ్రీనివాస్, గౌరవ సలహాదారులు కొట్టూరు రమేష్, విజయ్ కుమార్, సత్యనారాయణ, మాక్లూర్ మండల బిసిటియు అధ్యక్షులు గంగోనె సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
