Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 4:41 pm Posted by : ramakrishna

పేదల ప్రాణాలు కాపాడటమే లక్ష్యం

 

. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

పార్టీలకతీతంగా పేదల ప్రాణాలను కాపాడటమే తన లక్ష్యమని, పేదలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ అన్నారు. నగరంలోని క్యాంపు కార్యాలయంలో గౌతం నగర్ కు చెందిన హేమగ్న కి శనివారం ఎల్ఓసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఎల్ఓసి ఇప్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళుతున్నట్లు తెలిపారు. నగరంలోని గౌతం నగర్ కు చెందిన హేమగ్న మూత్ర పిండాల వ్యాధితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో వారికి రూ.2.40 లక్షల ఎల్ఓసి అందజేశామన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రోగికి తక్షణ సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.