Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 September 2025, 6:46 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ పార్టీ నుంచి సౌదాగర్ అరవింద్ సస్పెండ్

బతుకమ్మ, బిచ్కుంద : జుక్కల్ నియోజకవర్గంలో ఎస్సీ సెల్ చైర్మన్ అని చెప్పుకుంటూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారం సోదరుని తనయుడు సౌదాగర్ అరవింద్ ను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సస్పెండ్ చేశారని బిచ్కుంద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధర్పల్ గంగాధర్ తెలియజేశారు. సౌదాగర్ అరవింద్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ అని చెప్పుకుంటూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడమే కాకుండా 2003 ఎన్నికల్లో బిజెపి పార్టీకి మద్దతు తెలియజేయడమే కాకుండా పార్టీలో గ్రూప్ రాజకీయాలకు పురుడు పోస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడినట్లయితే పార్టీ తప్పకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని ఆయన తెలియజేశారు.