విప్ లుగా సత్యవతి, వివేకానంద

హైదరాబాద్, బతుకమ్మ: శాసన మండలి, శాసన సభలో బీఆర్ ఎస్ విప్ లను ఆ పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. శాసన మండలిలో సత్యవతి రాథోడ్, శాసన సభలో కేపీ వివేకానంద గౌడ్ ను విప్ లుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి విప్ ల నియామకానికి సంబంధించిన పత్రాలను స్పీకర్ కు అందజేశారు.