Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 March 2025, 3:57 pm Posted by : ramakrishna

ఘనంగా సత్యనారాయణ స్వామి వార్షికోత్సవ వేడుకలు       

బతుకమ్మ,వేల్పూర్:- మండలంలోని రామన్నపేట పరిసర ప్రాంతంలో గల శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ ఐదవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి నారాయణనంద స్వామి మాట్లాడుతూ ఉదయం స్వామి వారికి సుప్రభాతం  మూలవిరాట్టుకు ఉత్సవ విగ్రహాలకు అభిషేకం స్వస్తి ప్రణ్యవా వాచనం మంటవ ఆరభన హవసము ఎదుర్కోలు కళ్యాణం కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ప్రతి శనివారం భజన కార్యక్రమం అన్నదానం సత్రం నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  భక్తులు  తదితరులు పాల్గొన్నారు.