భీమ్‌గల్ సీఐగా సత్యనారాయణ గౌడ్ నియామకం
బతుకమ్మ, భీమ్‌గల్: నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని భీమ్‌గల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పొన్నం సత్యనారాయణ గౌడ్ ను నియమిస్తూ మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఆయనను ఇక్కడికి బదిలీ చేశారు. ఇది వరకు భీమ్‌గల్ సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా పని చేసిన నవీన్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో కమిషనరేట్ కు అటాచ్ చేసిన విషయం తెలిసిందే.