Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 November 2025, 5:28 pm Posted by : ramakrishna

సతీష్ గాయక్వాడ్ కి న్యాయశ్రీ అవార్డు

బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిప్ మెజిస్ట్రేట్ కోర్టు లో ప్రస్తుతం న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న గాయక్వాడ్ సతీష్ న్యాయశ్రీ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదిగా ఇప్పటివరకు హైకోర్టులో విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం బిచ్కుంద లో గల మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో కూడా తన సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.హైకోర్టు జస్టిస్ గౌస్ మీరా మొహినోద్దీన్ చేతులు మీదుగా న్యాయ శ్రీ 2025 అవార్డు అందుకోవడం ఎంతో సంతోషనీయమని అన్నారు. ఈ సందర్భంగా స్థానికులు న్యాయవాది సతీష్ కు శుభాకాంక్షలు తెలిపారు.