కలెక్టరేట్ లో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు
నిజామాబాద్ సిటి, బతుకమ్మ : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొని, సత్యసాయి బాబా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. భగవాన్ సత్యసాయి బాబా జీవిత విశేషాలు, బోధనలు, సేవా నిరతిని గుర్తు చేసుకున్నారు. వేడుకల సందర్భంగా సత్యసాయి బాబా సేవా సమితి ప్రతినిధులు భక్తి గీతాలు ఆలపించారు. సత్యసాయి ప్రబోధనలను...