సర్వాయి పాపన్నగౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలి

...జయంతి వేడుకలలో వక్తలు బతుకమ్మ, నిజామాబాద్ సిటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని వక్తలు పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలను ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. అంతకుముందు వినాయకనగర్ లో గల సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి ఎమ్మెల్యేలు పి.సుదర్శన్ రెడ్డి, డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ, రాష్ట్ర ఖనిజాభివృద్ది...