బతుకమ్మ, ఏర్గట్ల: మండల కేంద్రం లో అలాగే తోర్తి గ్రామం తో పాటు పలు గ్రామాల్లో సర్వాయి పాపన్న 375 వ జయంతి వేడుకలను గౌడ సంఘం సభ్యుల ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా గౌడ సంఘ సభ్యులు,సమాజ సేవకుడు మూడ్ దయానంద్, మాట్లాడుతూ బలవంతుల పాలనలో ఇబ్బందికి పాలైన సబ్బండా వర్ణాల బాధితులకు విముక్తి కలిగించాడానికి సర్వాయి పాపన్న తన గౌడ కులావృత్తిని వదిలి పెట్టి పీడిత ప్రజల కోసం పోరు బాట పట్టడనీ అన్నారు.అంతేగాకుండా బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేసిన తోలి బహుజన బిడ్డ అని సబ్బండాల వర్గాల రాజ్యాధికారం కోసం మార్గం చూపిన మహోన్నతుడు అని వారు అన్నారు.వీరత్వం లో ఏ మాత్రం తీసిపోని ఆయన్ను యువత గుర్తు చేసు కోవాలని ముడున్నర శతాబ్దాల క్రితం రాజ్యాధికారం కోసం కనీసం ఆలోచించని కాలంలో సింహాసనాన్ని అధిష్టించిన బహుజన సింహం నవాబులకు తబే దారులుగా మారిన వారు చేసిన దోపిడి పై తిరుగుబాటు చేసిన ధైర్య శాలి అన్నారు.17 వ శతాబ్దంలో నే తెలంగాణ గడ్డపై పోరు విత్తనాలు నాటిన విప్లవకారుడని ఆయన పొగిడారు. ఇట్టి కార్యక్రమాల్లో పచ్చిమట్ల నారాయణ గౌడ్, మగ్గిడి భూమాగౌడ్,రాజేశ్వర్ గౌడ్, శంకర్ గౌడ్,గోవింద్ గౌడ్,కోలా రమేష్ గౌడ్,మగ్గిడి వెంకటేష్ గౌడ్,మురళి గౌడ్,ప్రసాద్ గౌడ్,సుదనవేని వెంకటేష్ గౌడ్,హరీష్ గౌడ్,గౌడ యూత్ ఉపాధ్యక్షుడు కోలా రంజిత్ గౌడ్,గౌడ యూత్ సంఘ సభ్యులు వెంకటేష్ గౌడ్,రాజు గౌడ్,దశ గౌడ్, సమాజ సేవకుడు మూడ్ దయానంద్,పాల్గొన్నారు.