Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 August 2025, 5:47 pm Posted by : ramakrishna

సబ్బండ వర్ణాల ఆరాధ్య దైవం సర్వాయి పాపన్న గౌడ్

  • యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సబ్బండ వర్ణాల ఆరాధ్య దైవం సర్వాయి పాపన్న గౌడ్ అని యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ అన్నారు. స్వరాయి పాపన్న గౌడ్ 375వ జయంతి సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విపుల్ గౌడ్ మాట్లాడుతూ మొగలుల అరాచకాలను,దోపిడీలను చూసి చలించి పోయి మొఘల్ సామ్రాజ్యాన్ని నేలమట్టం చేసి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడి తెలంగాణ శివాజీగా పేరు గాంచిన గొప్ప పాలకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు.  సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతి నాయకుడు ఆదర్శంగా తీసుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అద్నాన్,జిల్లా ప్రధాన కార్యదర్శులు నరేందర్ గౌడ్,ఆకాశ్ రెడ్డి,రాజు గౌడ్,ఇర్ఫాన్,ముదాస్సేర్, బింగి శుభం,కల్పోల్ వంశీ,విష్ణు,గడ్కోలే సంతోష్ తదితరులు పాల్గొన్నారు.