Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 December 2024, 3:04 pm Posted by : ramakrishna

సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులసమస్యలను పరిష్కరించాలి

…టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు సత్యానంద్

 నిజామాబాద్ సిటి, బతుకమ్మ:

సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని టిఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి.సత్యానంద్,ఓ.రమేష్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  నిజామాబాద్ ధర్నా చౌక్ లో ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె కార్యక్రమానికి  అదివారంటీఎస్ యుటిఎఫ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వ శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న ఉద్యోగులు అదేవిధంగా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో పనిచేస్తున్న ఉద్యోగులందరిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఉద్యోగికి జీవిత బీమా ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలని కోరారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు 15 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని పెర్కోన్నారు. పదవి విరమణ బెనిఫిట్స్ 20 లక్షలు ఇవ్వలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి వి.సాయన్న డిచ్ పల్లి మండల బాధ్యులు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

 

Sarva Shiksha Abhiyan should solve the problems of employees