Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 8:21 pm Posted by : ramakrishna

మాజీ ఎంపీపీ చిత్రపటానికి నివాళులర్పించిన సర్పంచ్ లు

 

ఇందల్ వాయి, బతుకమ్మ :

 

ఇందల్ వాయి మండల కేంద్రంలోని గౌరారం (లింగాపూర్) గ్రామానికి చెందిన సర్పంచ్ హేమలత భర్త మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి ఇటీవల కత్తుల దాడులలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. దీంతో మండలంలోని సర్పంచ్ లు లింగాపూర్ గ్రామ సర్పంచ్ ఇంటికి వెళ్లి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి ఇమ్మడి గోపి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ఆయన ముందుండి ఆర్థిక సహాయం చేసే వారని, గౌరారం, లింగాపూర్ లో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. వారి కుటుంబ సభ్యులకు సర్పంచ్ ల ఫోరం తరఫున ఎల్లప్పుడు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు సుదర్శన్ నాయక్, చంద్రయాన్ పల్లి సర్పంచ్ ఆరేటి రఘు, ఇందల్ వాయి సర్పంచ్ లోకని గంగామణి గంగారం, గన్నారం, గంగారం తండా, తదితర గ్రామాల సర్పంచ్ లు పాల్గొన్నారు.