ఉపాధి హామీ కూలీలకు అల్పాహారం అందజేసిన సర్పంచ్
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని రాణంపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు గ్రామ సర్పంచ్ కొండల్వాడి శంకర్ శుక్రవారం అల్పాహారం అందజేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రతిరోజు తీవ్రమైన ఎండలో పనిచేస్తున్న వారికి అల్పాహారం అందించడం సంతోషంగా ఉందన్నారు. పనిచేస్తున్న సమయంలో ఎండకు సంబంధించిన జాగ్రత్తలు పాటించాలని, ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని వచ్చేటప్పుడు గొడుగులను వెంట తీసుకురావాలన్నారు. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని, పనిచేస్తున్న ప్రదేశంలో ఏదైనా ఇబ్బందులు కలిగితే వెంటనే తమకు సమాచారం అందించాలని, ఏదైనా ఆరోగ్య...