Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 6:28 pm Posted by : ramakrishna

ఉపాధి హామీ కూలీలకు అల్పాహారం అందజేసిన సర్పంచ్

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండలంలోని రాణంపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు గ్రామ సర్పంచ్ కొండల్వాడి శంకర్ శుక్రవారం అల్పాహారం అందజేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రతిరోజు తీవ్రమైన ఎండలో పనిచేస్తున్న వారికి అల్పాహారం అందించడం సంతోషంగా ఉందన్నారు. పనిచేస్తున్న సమయంలో ఎండకు సంబంధించిన జాగ్రత్తలు పాటించాలని, ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని వచ్చేటప్పుడు గొడుగులను వెంట తీసుకురావాలన్నారు. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని, పనిచేస్తున్న ప్రదేశంలో ఏదైనా ఇబ్బందులు కలిగితే వెంటనే తమకు సమాచారం అందించాలని, ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే ఆరోగ్య సిబ్బంది వద్దకు వెళ్లి పరీక్షించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, నాయకులు తోట సంగయ్య, నేరుగంటి బాలరాజ్, షాదుల్, నాయకులు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.