విద్యార్థుల సమస్య పై వెంటనే స్పందించిన సర్పంచ్
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలం అంబం నుంచి బోధన్ పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు బస్సు సమస్య వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం 4 గంటలకు కళాశాలలు ముగిసినా, బస్సు సౌకర్యం సరిగా లేక రాత్రి 7 గంటల వరకు ఇంటికి చేరుకోవాల్సి వస్తోంది. మంగళవారం ఈ సమస్యను గ్రామ సర్పంచ్ కుర్లపు గంగాధర్ దృష్టికి తీసుకెళ్లగా, సర్పంచ్ వెంటనే స్పందించి బోధన్ డీఎంకు చరవాణిలో సంప్రదించి సమస్యను పరిష్కరించారు. దింతో విద్యార్థులు హర్షం చేశారు.