కాలిపోయిన 15 కె.వి. డీటీఆర్‌ను రాత్రికి రాత్రే మార్చించిన సర్పంచ్

జుక్కల్ , బతుకమ్మ :   జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ కాలనీ బస్టాండ్ సమీపంలో ఉన్న 15 కె.వి. డీటీఆర్ (ట్రాన్స్‌ ఫార్మర్) కాలిపోవడంతో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొండ వెంటనే గ్రామ లైన్‌మన్ కె. మారుతికి తెలియజేశారు. సమస్య తీవ్రతను గుర్తించిన సర్పంచ్ చర్యలు తీసుకుని కొత్త 15 కె.వి. డీటీఆర్‌ను తెప్పించి, చీకటి అయినప్పటికీ రాత్రి 8 గంటల సమయంలో విద్యుత్ శాఖ సిబ్బందిని పిలిపించి ట్రాన్స్‌ ఫార్మర్...