Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 March 2026, 4:47 pm Posted by : ramakrishna

తాత్కాలిక రోడ్డుకు మరమ్మతులు చేయించిన సర్పంచ్

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల కేంద్రంలోని డబుల్ రైల్వే లైన్ పనులు జరుగుతున్నందున రైల్వే గేటును మూసివేశారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులకు గురవడంతో స్థానిక సర్పంచ్ చింతల కిషన్ ప్రత్యేక దృష్టి సారించి రైల్వే బ్రిడ్జి కింది నుండి పైపు వేసి మోరం పోయించి రోడ్డుకు మరమ్మతులు చేయించారు. ద్విచక్ర వాహనదారుల ఇబ్బందులను తొలగించారు. దీంతో వాహనదారులు సర్పంచ్ చింతల కిషన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాహనాదారులు, తదితరులు పాల్గొన్నారు.