Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 April 2026, 5:19 pm Posted by : ramakrishna

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్

 

. . . రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచన

 

మాక్లుర్, బతుకమ్మ :

 

మాక్లుర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో చిక్లి గ్రామంలో నూతన సర్పంచ్ భూమన్న, ఉప సర్పంచ్ భూరోల్ల సతీష్ ఆదివారం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఆఫీసర్ స్వప్న, పీఐసీ చైర్మన్ ఫిరోజ్ ఖాన్ పాల్గొన్నారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కల్లాల వద్దకే తెచ్చి తమ ధాన్యాన్ని ఎండబోయాలని సూచించారు. రైతులు తెచ్చిన వారి ధాన్యాన్ని వెనువెంటనే తూకం చేయాలన్నారు. వరి ధాన్యం గ్రేడ్ ఏ కు రూ.2389, కామన్ వరి ధాన్యానికి రూ.2369 ప్రభుత్వం చెల్లిస్తుందని రైతులకు తెలిపారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన వరి ధాన్యాన్ని వెను వెంటనే మ్యాచర్ ద్వారా చూసి తొందరగా మార్కెట్ యార్డుకు లారీలలో తరలించేటట్లు చూడాలని సేంటరించర్ అఖిల్ సిబ్బందికి సూచించారు. లారీల కొరత ఉన్నట్లయితే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. వరి ధాన్యాన్ని తరలించే క్రమంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే క్లస్టర్ ఆఫీసర్ స్వప్న దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా బాధ్యత వహించాలని తెలిపారు. హమాలి వాళ్లకు కరెంట్  సౌకర్యం లేదని చెప్పడంతో క్లస్టర్ ఆఫీసర్ స్పందించి కరెంటు ఏర్పాటు చేయాలని సిబ్బందికి గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ సూచించారు. గ్రామ సర్పంచ్ స్పందించి వెంటనే కరెంటు మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూమన్న, ఉప సర్పంచ్ సతీష్,  క్లస్టర్ ఆఫీసర్ స్వప్న, పిఐసి చైర్మన్ ఫెరోజ్ ఖాన్, రైతులు లడ్డు, దండు రాజేశ్వర్, శివుడు, నరేష్, పల్లెన్న, భోజన్న, రైతులు తదితరులు పాల్గొన్నారు.

 

Sarpanch inaugurates purchasing center