బీర్కూర్ పీహెచ్‌సీలో ఆరోగ్య శిబిరం ప్రారంభించిన సర్పంచ్

  బాన్సువాడ, బతుకమ్మ :   బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం ఆరోగ్య శిబిరాన్ని స్థానిక సర్పంచ్ ధర్మ తేజ ప్రారంభించారు. ఈ శిబిరంలో మొత్తం 229 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్న 25 మంది రోగులను బాన్సువాడ, కామారెడ్డి, నిజామాబాద్ ఆసుపత్రులకు రిఫర్ చేశారు. అదనంగా 39 మంది రోగులకు ల్యాబ్ పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరం ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి రావడం పట్ల స్థానికులు సంతోషం...