Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 5:32 pm Posted by : ramakrishna

10 వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సన్మానించిన సర్పంచ్

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో రైడ్స్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ ముగింపు కార్యక్రమంలో భాగంగా పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ మెమొంటో అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. విద్యార్థిని, విద్యార్థులు భవిష్యత్తులో ఇంకా చక్కగా చదివి ఉన్నతమైన స్థానాలకు వెళ్లాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి కట్ట శ్రీనివాస్, అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, రైడ్స్ అధ్యక్షులు కరోల్ల కృష్ణ ప్రసాద్, కార్యదర్శి పార్వతి శేఖర్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.