ఏర్గట్ల గ్రామ విద్యార్థులను ఘనంగా సన్మానించిన సర్పంచ్
ఏర్గట్ల, బతుకమ్మ : ఏర్గట్ల గ్రామానికి చెందిన విద్యార్థులు విద్య, క్రీడలు, ఎన్‌సీసీ రంగాల్లో విశేష ప్రతిభ కనబరచి గ్రామానికి మంచి గుర్తింపు తీసుకురావడంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు.తెలంగాణ ఈసెట్‌లో 8వ ర్యాంకు సాధించిన దొబ్బల రెస్వాంత్ (తండ్రి రాజన్న), ఎన్‌సీసీ ఫైరింగ్ విభాగంలో తెలంగాణ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సుధనవేని సాత్విక (తండ్రి శ్రీనివాస్ గౌడ్), నేషనల్ వాలీబాల్ పోటీలకు ఎంపికైన కనుగుర్తి బాలమణి (తండ్రి ఎల్లయ్య)లను ఈ సందర్భంగా అభినందించారు.గ్రామ సర్పంచ్ కొలిప్యాక...