అక్రమ ఇసుక విక్రయాలపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ డిమాండ్
ఏర్గట్ల, బతుకమ్మ : తాళ్ల రాంపూర్ గ్రామంలో ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక రేట్లకు ఇసుకను విక్రయిస్తున్న ఘటనలు తమ దృష్టికి వచ్చాయని గ్రామ సర్పంచ్ బెజ్జారపు పావని భానుచందర్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని కొందరు అక్రమంగా ఇసుకను అధిక ధరలకు అమ్ముతూ పేదల సొంతింటి కలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై లబ్ధిదారుల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు సర్పంచ్ పావని భానుచందర్ ఏర్గట్ల మండల కేంద్రంలోని తహసిల్దార్‌ను కలిసి వినతి...