Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 5:54 pm Posted by : ramakrishna

ఏసీబీకి చిక్కిన సర్పంచ్

 

. . . క్వారీ నిర్వాహకుల నుంచి రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టివేత

 

వెబ్ డెస్క్ , బతుకమ్మ :

 

క్వారీ నిర్వాహణ సక్రమంగా జరుగాలంటే తనకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసి మొదటి విడత రూ.2 లక్షల లంచం తీసుకుంటున్న సర్పంచ్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రాష్ట్ర ఏసీబీ చరిత్రలో తొలిసారి అవినీతి నిరోధక శాఖకు సర్పంచ్ పట్టుబడిన ఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం మొదుగడ్డ తాండలో జరిగింది. ముదుగడ్డ తాండ సర్పంచ్ ధారావత్ వీరు తన పంచాయితీ పరిధిలో నిర్వహిస్తున్న శారద స్టోనెక్స్ ప్రీమియర్ గ్రానైట్, రాశీ గ్రానైట్ నిర్వాహకులను లంచం డిమాండ్ చేశారు.  తనకు రూ.30 లక్షల లంచం ఇవ్వాలని లేకపోతే క్వారీ నిర్వాహణ జరుగదని బెదిరించారు. దానితో వారు బేరసారాలు సాగించగా రూ.13 లక్షలకు డీల్ కుదిరింది. దాంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. పంచాయితీ కార్యాలయం వద్ద వరంగల్ ఏసీబీ రేంజ్ అధికారులు ధారావత్ వీరు గ్రానైట్ నిర్వాహకుల నుంచి రూ.2 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి వరంగల్ ఏసీబీ కోర్టు ముందు హాజరుపర్చగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.