కారేగాంలో 15 హామీలతో సర్పంచ్ అభ్యర్థి మేనిఫెస్టో

 కోటగిరి, బతుకమ్మ  :  స్థానిక సంస్థల ఎన్నికలతో  పల్లెల్లో సందడి నెలకొంది. గెలిపించండి పథకాలను పొందండి అంటూ సర్పంచ్ అభ్యర్థులు ప్రకటిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండలంలోని కారేగాం గ్రామానికి చెందిన నరహరి రవి తనను సర్పంచ్ గా గెలిపించాలని 15 హామీలతో మేనిఫెస్టో రూపొందించి ప్రకటించారు. ఇందులోని విషయాలు... గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపడే యువతకు లైబ్రరీ ఏర్పాటు.  పుట్టబోయే ప్రతి ఆడబిడ్డకు రూ.3116 నజరానా.  గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు. గ్రామంలో తాగునీరు,డ్రైనేజీ,వీధిలైట్లు వంటి మౌలిక సదుపాయా...