Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 December 2025, 12:56 pm Posted by : ramakrishna

కారేగాంలో 15 హామీలతో సర్పంచ్ అభ్యర్థి మేనిఫెస్టో

 కోటగిరి, బతుకమ్మ  :  స్థానిక సంస్థల ఎన్నికలతో  పల్లెల్లో సందడి నెలకొంది. గెలిపించండి పథకాలను పొందండి అంటూ సర్పంచ్ అభ్యర్థులు ప్రకటిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండలంలోని కారేగాం గ్రామానికి చెందిన నరహరి రవి తనను సర్పంచ్ గా గెలిపించాలని 15 హామీలతో మేనిఫెస్టో రూపొందించి ప్రకటించారు. ఇందులోని విషయాలు… గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపడే యువతకు లైబ్రరీ ఏర్పాటు.  పుట్టబోయే ప్రతి ఆడబిడ్డకు రూ.3116 నజరానా.  గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు. గ్రామంలో తాగునీరు,డ్రైనేజీ,వీధిలైట్లు వంటి మౌలిక సదుపాయా ల సమస్యలపై ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తా.  మహి ళలకు టైలరింగ్,ఎంబ్రాయిడింగ్ శిక్షణ,కుటీర పరిశ్రమ ఏర్పా టులో ప్రోత్సాహకాలు కల్పించడం. గ్రామాన్ని మిగులు పం చాయతీగా తీర్చి దిద్దడంలో దృష్టి సారిస్తా.  గ్రామ యువత ఆరోగ్య నిమిత్తం గ్రామంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం. గ్రామంలో ఐదేళ్లలో నాలుగు నెలల కు ఒకసారి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు.  అలాగే ఐదేళ్లలో బిపి,షుగర్,థైరాయిడ్,హార్ట్ బాధితులకు ప్రతినెల 2 వేలు ఉచిత మందులు అందజేస్తానని ఆయన ప్రకటించారు.  గ్రామ ప్రజలు తనను ఆదరించి ఆశీర్వదించాలని కోరారు.  సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే ఎన్నికల సందర్భంగా తెలిపిన ప్రతి ఒక్క హామీని తప్పకుండా అమలుపరుస్తానని ఆయన  స్పష్టం చేశారు.