సర్పంచ్ అభ్యర్థి మృతి..

మహబూబాబాద్, బతుకమ్మ :   మహబూబాబాద్ జిల్లా నడివాడ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా రాగిపాటి బుచ్చిరెడ్డి బరిలోకి దిగారు.  మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో సోమవారం బుచ్చిరెడ్డి  గుండెపోటుకు గురయ్యారు. ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం  మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.