రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో వెల్నెస్ హాస్పిటల్ నిజామాబాద్ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ, ఎగ్జిక్యూటివ్ సందీప్ ఆధ్వర్యంలో బుధవారం సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, ఉప సర్పంచ్ షేక్ నిస్సార్ ను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద త్వరలో వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.