Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 January 2026, 9:24 pm Posted by : ramakrishna

15వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా సారిక నామినేషన్

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరఫున యువ నాయకురాలు సారిక శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారులకు ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా సారిక మాట్లాడుతూ 15వ వార్డు ప్రజలందరూ తనను ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీకి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. వార్డు అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలకు శుద్ధమైన మంచినీరు, శుభ్రమైన పారిశుద్ధ్యం, సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థ, మెరుగైన రహదారులు, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక వసతులను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానని తెలిపారు. ప్రజల సహకారంతో 15వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా సారిక పేర్కొన్నారు.