సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మన దేశ సుస్థిర నిర్మాణానికి ఎనేలేని సేవలు అందించిన ఉక్కుమనిషి భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ, దేశ ప్రజలకు జాతీయ ఐక్యత దినోత్సవ సందర్భంగా నిజామాబాద్ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, నివాళుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి నేతృత్వంలో ఆర్‌ఆర్ చౌరస్తా శివాజీ విగ్రహం నుండి వర్ని చౌరస్తా వద్ద ఉన్న సర్దార్ పటేల్ విగ్రహం వరకు రన్ ఫర్...