ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ “సర్వాయి పాపన్న 1650లో వరంగల్ జిల్లా రఘునాథపాలెం మండలం, కిలాష్పూర్ గ్రామంలో జన్మించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి 1675లో సర్వాయిపేటలో రాజ్యం స్థాపించారు. గోల్కొండ కోటపై 12,000...