ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలను సోమవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గౌడ సంఘం అధ్యక్షుడు రంగు హనుమ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం, చట్టాలు లేని రోజుల్లోనే ప్రజల హక్కుల కోసం సర్వాయి పాపన్న గౌడ్ పోరాడారని పీడిత జనుల కోసం బహుజనుల ఆత్మగౌరవం కోసం తన సర్వస్వాన్ని ధారపోసిన మహాయోధుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ గౌడ్,...