నిజామాబాద్ మీదుగా సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర రైలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఏప్రిల్ 9న ఐఆర్సీటీసీ సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర ప్రారంభమవుతుందని టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ డిఎస్జీపీ కిశోర్ తెలిపారు. ఏడు జ్యోతిర్లింగ దర్శన యాత్ర సికింద్రాబాద్ ఐఆర్సిటిసి ప్రత్యేక టూరిస్ట్ ప్యాకేజీ తో భారత్ గౌరవ్ ప్రత్యేక టూరిస్ట్ రైలు ప్రారంభమవుతుందని అన్నారు. ఏప్రిల్ 9న ఐఆర్సీటీసీ సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర సికింద్రాబాద్, నిజామాబాదు , మీదుగా ఉజ్జయినికెళ్తుందని తెలిపారు. ఏడు జ్యోతిర్లింగాల దర్శనాలు ఉంటాయన్నారు. ఉజ్జయిని, మహాకాళేశ్వర్, ద్వారకా నాగేశ్వర్,సోమనాథ్, భీమశంకర్, త్రయంబకేశ్వర్, గృశ్నేశ్వర్,జ్యోతిర్లింగాలను...