విద్యుదాఘాతంతో సపాయి కార్మికునికి గాయాలు
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి తండా గ్రామపంచాయతీ పరిధిలో సేవలల్ మందిరం వద్ద గురువారం ఉదయం కరెంటు స్తంభం ఎక్కిన మల్టీపర్పస్ కార్మికుడు సాయిలు(41)కు అకస్మాత్తుగా మెయిన్ లైన్ కరెంటు షాక్ తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయాడని స్థానికులు తెలిపారు. ఒకే స్తంభానికి రెండు లైన్లు ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఇందల్వాయి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ఓకే స్తంభానికి రెండు సప్లై ఉండడంతో ఈ ప్రమాదం జరిగిందని బాధ్యులు ఎవరైనా వారి పైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.కరెంట్ షాట్ తగలడంతో స్థానికులు...