ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి తండా గ్రామపంచాయతీ పరిధిలో సేవలల్ మందిరం వద్ద గురువారం ఉదయం కరెంటు స్తంభం ఎక్కిన మల్టీపర్పస్ కార్మికుడు సాయిలు(41)కు అకస్మాత్తుగా మెయిన్ లైన్ కరెంటు షాక్ తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయాడని స్థానికులు తెలిపారు. ఒకే స్తంభానికి రెండు లైన్లు ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఇందల్వాయి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ఓకే స్తంభానికి రెండు సప్లై ఉండడంతో ఈ ప్రమాదం జరిగిందని బాధ్యులు ఎవరైనా వారి పైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.కరెంట్ షాట్ తగలడంతో స్థానికులు సపాయి కార్మికుడిని జిల్లా కేంద్రంలోని మనోరమ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.కరెంట్ షాక్ కు గురైన సాయిలు చేయి పూర్తిగా కాలడంతో చేయి తీసివేయడం జరిగిందని తెలిపారు. అలాగే మరో రెండు రోజుల తర్వాత మరొక చెయి కోసం చెప్తామని డాక్టర్లు చెప్పినట్లు స్థానికులు తెలిపారు. గాయపడ్డ వ్యక్తి ప్రాణాలకు మరో ఐదు రోజుల వరకు గ్యారంటీ ఇవ్వలేమని వైద్యులు తెలిపినట్లు తెలిపారు, కరెంటు షాక్కు గురైన సాయిలు కుటుంబం రెక్కాడితే గానీ డోక్కాడలేని దీన పరిస్థితని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.