సంస్కార్ ప్రకృతి ఆశ్రమం దేవాలయంలాంటిది
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రుద్రూర్, బతుకమ్మ : సంస్కార్ ప్రకృతి ఆశ్రమం ఒక దేవాలయంలాంటిదని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలోని సంస్కార్ ప్రకృతి ఆశ్రమంలో లవణం-హేమలత లవణం దంపతుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. లవణం-హేమలత లవణం దంపతులు...