Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 August 2025, 2:00 pm Posted by : ramakrishna

సంస్కార్ ప్రకృతి ఆశ్రమం దేవాలయంలాంటిది

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

రుద్రూర్, బతుకమ్మ  : సంస్కార్ ప్రకృతి ఆశ్రమం ఒక దేవాలయంలాంటిదని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలోని సంస్కార్ ప్రకృతి ఆశ్రమంలో లవణం-హేమలత లవణం దంపతుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. లవణం-హేమలత లవణం దంపతులు జోగిని వ్యవస్థను తొలగించారని అన్నారు. వైద్యం కోసం చాలా చోట్ల ఆసుపత్రిలో డబ్బులు ఖర్చులు పెట్టి చికిత్సలు చేయించుకుంటున్నారని అయినా కూడా వ్యాధులు నయం కావడం లేదని, కానీ అక్బర్ నగర్ ప్రకృతి చికిత్సలయంలో తక్కువ ఖర్చుతో అన్ని రకాల రోగాలకు మెరుగైన చికిత్సలు చేస్తున్నారాని ఆయన పేర్కొన్నారు. ఇక్కడికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చికిత్సలు చేయించుకుంటున్నారన్నారు. ఈ ప్రకృతి ఆశ్రమాన్ని మంతెన సత్యనారాయణ రాజు, మార్ని రామకృష్ణలు కాపాడుతూ వస్తున్నారని, ఈ ఆశ్రమంలో సుమారు 100 మంది వరకు ఉపాధి పొందుతున్నారన్నారు. సంస్కార్ ప్రకృతి ఆశ్రమాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, జహీరాబాద్ పార్లమెంట్ దిశ కమిటీ మెంబర్ నడిపింటి నగేష్, మాజీ జెడ్పీటీసి నారోజీ గంగారాం, సొసైటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ పత్తి రాము, బందెల సంజీవ్, షేక్ ఖాదర్, రామాగౌడ్, అధికారులు తహసీల్దార్ తారాబాయి, ఎంపీడీవో భీంరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రకృతి ఆశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Sanskar Prakriti Ashram is like a temple