Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 January 2025, 3:04 pm Posted by : ramakrishna

సంక్రాంతి వచ్చింది.. సంబరం తెచ్చింది..

బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  శుక్రవారం ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్తినిలు రంగవల్లుల పోటీలో పాల్గొని వివిధ ముగ్గులు వేయడం జరిగినది. విద్యార్థులు గాలిపటాలు ఎగరవేసి ఆనందం వ్యక్తం చేసినారు. విజేతలకు బహుమతులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు పల్లెపాటి. వేణుగోపాల్ రావు అందజేస్తూ ఈనాటి కాలంలో విద్యార్థిని, విద్యార్థులు మన ఆచార వ్యవహారాలను, వివిధ పండుగలను మరిచిపోతున్నారని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పారుని పైన ఉన్నదని తెలియజేయడం జరిగినది. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మహేష్ కుమార్, నరసింహ స్వామి,రాజేందర్, జయశ్రీ,త్రివేణి,మమత,రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.