సంకష్ట చతుర్థి పురస్కరించుకొని సందడిగా ఆలయాలు
భక్తులతో సందడిగా మారిన సుబ్రహ్మణ్యస్వామి ఆలయం నిజామాబాద్ సిటీ బతుకమ్మ: నగరంలో సంకష్ట చతుర్ధిని పురస్కరించుకొని విఘ్నేశ్వరుని ఆలయాలతో పాటు మిగతా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు సంకష్ట చతుర్ధిని పురస్కరించుకొని ఉపవాస దీక్షలతో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే నగర శివారులోని బోర్గం పి గ్రామంలో గల సుబ్రమణ్య స్వామి ఆలయంలో సంకష్ట చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అభిషేకాలు అర్చనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. సుబ్రహ్మణ్యస్వామిని నిత్యం కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఆలయ...