Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 November 2024, 7:39 pm Posted by : ramakrishna

సంకష్ట చతుర్థి పురస్కరించుకొని సందడిగా ఆలయాలు

  • భక్తులతో సందడిగా మారిన సుబ్రహ్మణ్యస్వామి ఆలయం

నిజామాబాద్ సిటీ బతుకమ్మ: నగరంలో సంకష్ట చతుర్ధిని పురస్కరించుకొని విఘ్నేశ్వరుని ఆలయాలతో పాటు మిగతా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు సంకష్ట చతుర్ధిని పురస్కరించుకొని ఉపవాస దీక్షలతో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే నగర శివారులోని బోర్గం పి గ్రామంలో గల సుబ్రమణ్య స్వామి ఆలయంలో సంకష్ట చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అభిషేకాలు అర్చనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. సుబ్రహ్మణ్యస్వామిని నిత్యం కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఆలయ పూజారి తెలిపారు. ఎంతో మహిమగల ఈ ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తే తాము కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయని కావున భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారని ఆయన చెప్పారు. డిసెంబర్ 6వ తేదీన సుబ్రహ్మణ్యస్వామి వార్షికోత్సవం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామి వారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని ఆయన కోరారు.