పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగించాలి
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : మున్సిపల్ పరిధిలలో పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తో కలిసి జిల్లాలోని మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శానిటేషన్, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, పన్నుల వసూళ్లు, అమృత్ పథకం, ఇంజనీరింగ్ పనులు, నర్సరీల్లో మొక్కల పెంపకం, వీధి లైట్లు, ఇంటింటి చెత్త సేకరణ, అడ్వర్టైజ్మెంట్ల పై పన్నుల వసూళ్లు, తదితర అంశాలపై కలెక్టర్...