Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 April 2025, 6:17 pm Posted by : ramakrishna

సానిటేషన్ వర్కర్లు వేసవిలో జాగ్రత్తలు పాటించాలి

  • మున్సిపల్ కమిషనర్ గంగాధర్

 

భీమ్ గల్, బతుకమ్మ : వేసవి దృష్ట్యా పట్టణంలో పని చేసే మున్సిపల్ శానిటేషన్ వర్కర్లు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వేసవికాలం దృష్ట్యా మున్సిపల్ ఆఫీస్ లో మంగళవారం మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా సానిటేషన్ వర్కర్స్ అందరూ తగు జాగ్రత్తలు తీసుకొని పనిచేయాలన్నారు. వెంట ఓ ఆర్ ఎస్ పాకెట్లను ఉంచికొని క్రమం తప్పకుండా నీటిలో  కలుపుకొని త్రాగాలని సూచించారు. వర్కర్స్ కు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందించారు. వేసవికాలం ఉన్నందున శానిటేషన్ వర్కర్స్ వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ పని చేయాలని కమిషనర్ అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అజయ్ పవర్. మెడికల్ సిబ్బంది. మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.